హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరవుకు కారణం కాంగ్రెస్ నిర్లక్ష్యమే: కేటీఆర్

BHPL: కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కరవుకు కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గోదావరి నుంచి 750 టీఎంసీలకు పైగా, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారని, కాళేశ్వరం కన్నెపల్లి పంపులతో పాటు దేవాదుల పంపులను వినియోగించి చెరువులు, రిజర్వాయర్లు నింపలేదని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.