హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యం.. వృద్ధుడి మృతి

KNR: జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కొక్కుల సమ్మయ్య (60) అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కాలు ఫ్రాక్చర్‌కు చికిత్స చేస్తూ 5 నిమిషాల్లో 3 ఇంజెక్షన్లు ఇవ్వడంతో ఆయనకు శ్వాస ఆడలేదని, మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలిస్తుండగా చనిపోయాడని కుమారుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.