ADB: నేరడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని బోథ్ MLA అనిల్ జాదవ్ శుక్రవారం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


