BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గమాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్య, జ్ఞానం, విజ్ఞానానికి ప్రతీకగా అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు
తెలంగాణ
సరస్వతీ దేవిగా నవదుర్గమాత దర్శనం


