PDPL: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు రాజన్నకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య వర్గాలతో సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
కాంగ్రెస్ వాణిజ్య సెల్ జిల్లా అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న


