హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కేంద్రం తలుపులు ధ్వంసం..!

SRPT: గరిడేపల్లి మండలం కీతవారిగూడెం లోని అంగన్వాడీ కేంద్రం-2 తలుపులు ధ్వంసమయ్యాయి. కొందరు ఆకతాయిలు కాలితో తన్ని తలుపులను విరగ్గొట్టారని కేంద్రం నిర్వాహకురాలు మల్లమ్మ తెలిపారు. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందించే కేంద్రంలో ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.