హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ASF: కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పెండింగ్ నెల వేతనాన్ని వెంటనే చెల్లించాలని కార్మికుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోకి కమిషనర్ తిరుపతిని వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారిని శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు.