హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIN సంస్థ పేరుతో ఈ-మెయిళ్లు.. జాగ్రత్త!

హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ సంస్థ పేరుతో సైబర్ నేరగాళ్లు పెద్ద మోసానికి తెరలేపారు. వర్క్‌షాప్, సర్టిఫికెట్ పేరుతో రూ.3,999 వసూలు చేసేందుకు నకిలీ ఈ-మెయిళ్లు పంపిస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌లో తమకు సంబంధం లేదని ఎన్ఐఎన్ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.