హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాతో ప్రజలకు ఇబ్బందులు

NRPT: మాగనూరు నుంచి కృష్ణ మండలం వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ టిప్పర్లలో ఇసుకను రవాణా చేస్తూ.. గ్రామీణ మట్టి రోడ్లపై దుమ్ము రేపుతున్నారని వాపోతున్నారు. భారీ వాహనాలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.