HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని కేజేఆర్ గార్డెన్లో అక్రమ కట్టడాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. బంగ్లా నంబర్ 218 పరిధిలోని స్థలంలో ఈరోజు ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. 30 ఏళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలంపై ఇటీవల కేసు కొట్టివేయడంతో అధికారులు చర్యలకు దిగారు. నోటీసులు జారీ చేసిన అనంతరం కోర్టు క్లియరెన్స్తో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
తెలంగాణ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూల్చివేతలు


