హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి'

NRPT: యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని నర్వ మండల వ్యవసాయ అధికారి అఖిల రెడ్డి సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. శనగ, జొన్న, కుసుమ, పెసర, మినుము, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు సాగు చేయాలని, ప్రభుత్వం త్వరలో సబ్సిడీలు అందించనుందని తెలిపారు.