హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ బ్యాంక్ అవగాహన కార్యక్రమం

SRPT: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హుజూర్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో మార్కెటింగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా డిపాజిట్లు, వాహన, గృహ రుణాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని మేనేజర్ వెంకటేశ్వర్లు, ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అకౌంటెంట్ గులషన్, అటెండర్ అబ్దుల్ సత్తార్, ఖాతాదారులు పాల్గొన్నారు.