RR: అత్తాపూర్లో పిల్లర్ నంబర్ 183 సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు, మరణానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ తర్వాత వెల్లడి కానున్నాయి.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం


