GDWL: అయిజలోని 9వ వార్డు కౌన్సిలర్ శివ స్వామి ఇరుముడి ధరించి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం 1,200 కిలోమీటర్ల మహాపాదయాత్రను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. దాదాపు 40 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్రలో కాలినడకన ప్రయాణించి శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర విజయవంతం కావాలని కోరుతూ పార్టీల నాయకులు వీడ్కోలు పలికారు.
తెలంగాణ
1200 కిలో మీటర్ల ఆధ్యాత్మిక పాదయాత్ర ప్రారంభం


