హైదరాబాద్: 28°C
వార్తలు

బాలికపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత..

హర్యానాలోని ఫరీదాబాద్‌లో 13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడితో వాకింగ్‌కు వెళ్లిన బాలికను నిర్మానుష్య భవనంలోకి లాకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. భయంతో మొదట ఎవరికీ చెప్పకపోయినా, తల్లి ప్రశ్నించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు.