హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాకర్స్ సమస్యలపై ఎమ్మెల్యే చొరవ

BHNG: భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం మార్నింగ్ వాక్ నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వాకర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మైదానంలో ప్రహరీ గోడ, ఓపెన్ జిమ్, విద్యుద్దీపాలు, వాకర్స్ ట్రాక్, మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.