సిద్దిపేట జిల్లా వంగపల్లికి చెందిన బొడికె ప్రేమ్కుమార్ (25) హైదరాబాద్ కొత్తూరు పరిధిలో హత్యకు గురయ్యాడు. కొత్తూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అతడు, స్నేహితులు ఇమ్రాన్, నవాజ్లతో కలిసి మద్యం తాగాడు. రూ.20 వేల ఆర్థిక లావాదేవీల గొడవతో వారు ప్రేమ్కుమార్పై కత్తులతో దాడి చేసి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
డబ్బుల వివాదం.. హైదరాబాద్లో యువకుడి హత్య!


