హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి మండిపల్లిని కలిసిన క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

అన్నమయ్య:  క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో ప్రతినిధులు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేశారు. దీపావళి నేపథ్యంలో క్రాకర్స్ వ్యాపారుల లైసెన్సులు, అనుమతులు, భద్రతా నిబంధనలు, వ్యాపార నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై మంత్రితో చర్చించారు.