సూర్యాపేట: మండలం బాలెంల స్టేజ్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున డీసీఎం వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వాకింగ్కు వెళ్లిన సైదులు, నాగరాజు, జానయ్యలను డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. సైదులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందారు. జానయ్యకు చికిత్స కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వాకింగ్కు వెళ్లిన ఇద్దరు మృతి


