హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు HYDలో లక్కీ డ్రా.. అదృష్టం ఎవరికో?

HYD: కొత్తగా అనుమతించనున్న 41 బార్ల కోసం ఎక్సైజ్ శాఖ నేడు లక్కీ డ్రా నిర్వహించనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 14 బార్లకు 4,251, మున్సిపాలిటీల్లోని 27 బార్లకు 4,519 చొప్పున మొత్తం 8,770 దరఖాస్తులు వచ్చాయి. నార్సింగిలో ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారుల సమక్షంలో ఎంపిక చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.