హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరేష్ మృతి కలకలం.. పోలీసులపై కుటుంబసభ్యుల ఆరోపణలు!

GDWL: ధరూర్ మండలం బూరెడ్డిపల్లికి చెందిన వీరేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు. తమ కుమారుడి మృతికి పోలీసుల వేధింపులు, స్థానిక రాజకీయ కక్షలే కారణమని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.