హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో యువకుడిపై కత్తితో దాడి

TPT: తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ సమీపంలో బండి హర్షవర్ధన్ (22)పై ముగ్గురు యువకులు దాడి చేశారు. హారన్ కొట్టాడనే కారణంతో గొడవకు దిగి, హేమసాయి అనే వ్యక్తి కత్తితో పొడిచినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన యువకుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.