హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో నగర పంచాయతీ వైసీపీ అభ్యర్థి

PLD: దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని కారంపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఛైర్మన్ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడంపై వైసీపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.