హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వానంగా తయారైన రహదారి

SKM: కొత్తూరు నుంచి కలిగాం, బమ్మిడి తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారింది. వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.