హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవాదళ్ నూతన నాయకులకు MLA శుభాకాంక్షలు

JN: కాంగ్రెస్ సేవాదళ్ జనగామ జిల్లా నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని పాలకుర్తిలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం సేవాదళ్ నేతలు బూత్ స్థాయిలో కృషి చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.