హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకులోయలో ఎన్నికల కోడ్ అమలు

ASR: అరకులోయలో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. పట్టణంలోని రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను తొలగించారు. నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.