హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

750 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

NDL: ప్యాపిలి మండలం సీతమ్మ తండా, అలేబాద్ తండాల్లో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 750 లీటర్ల బెల్లపు ఊటను ఐదు బృందాలు కలిసి ధ్వంసం చేశాయి. కర్నూలు, నంద్యాల, డోన్, బనగానపల్లె ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం నిల్వలు, రవాణా సమాచారాన్ని 9440902584 నంబర్‌కు తెలియజేయాలని అధికారులు కోరారు.