హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల వన్‌‌టౌన్ ఎస్సైగా జయప్ప

NDL: వన్‌‌టౌన్  పోలీస్ స్టేషన్ ఎస్సైగా జయప్ప గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రుద్రవరం పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, సమస్యలపై నిర్భయంగా సమాచారం అందించాలని కోరారు.