హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 17 మందికి జరిమానా

TPT:డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 17 మంది నిందితులు ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి ప్రత్యేక పట్టణ కోర్టు రెండో తరగతి న్యాయమూర్తి వి.ధనలక్ష్మి తీర్పు వెలువరించారు. ఈ మేరకు కోర్టు పోలీసు శివుడు తెలిపారు.తిరుపతి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడిపిన వాహనచోదకులపై కేసులు నమోదు చేసామన్నారు.