హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తాచెదారంతో బతుకమ్మ కుంట..!

NLG: జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వినాయక విగ్రహాల అవశేషాలు, పూల వ్యర్థాలతో అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. సద్దుల బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో మహిళలకు ఇబ్బందులు కలగకుండా కుంటను వెంటనే శుభ్రం చేయాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.