ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ (జి)లో కొన్నేళ్ల క్రితం నిర్మించిన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై కంకర తేలడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
కంకర తేలి ప్రమాదకరంగా కేస్లాగూడ రహదారి


