హైదరాబాద్: 28°C
తెలంగాణ

తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి పెట్టాలి

MLG: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని గురువారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి డి. సంజీవరావు సూచించారు. నీటి లభ్యతను బట్టి సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, బిందు సేద్యంతో నీటిని ఆదా చేయాలని తెలిపారు. రైతులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.