హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురి ఘాట్ల వద్ద జారిపడే ప్రమాదం

JGL: ధర్మపురి క్షేత్రంలో ఈ నెల 18న సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. మంగళి ఘాట్, సంతోషీమాత ఘాట్‌ల వద్ద బతుకమ్మలను నదిలో నిమజ్జనం చేయనున్నారు. అయితే నది ఒడ్డున ఒండ్రుమట్టి, పాకురు పేరుకుపోవడంతో భక్తులు జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక పోసి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.