JGL: ధర్మపురి మండలంలోని నక్కలపేట–తుమ్మెనాల ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు అడుగడుగునా గోతులు ఏర్పడ్డాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్పూర్ మండలం నుంచి జగిత్యాలకు వెళ్లేందుకు ఈ రహదారి దూరాన్ని తగ్గిస్తుందని, అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరారు.
తెలంగాణ
గోతులతో ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి


