హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగంపేట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం

తూ.గో: రంగంపేట మండలం సింగంపల్లి గొల్లవాని చెరువులో గురువారం సాయంత్రం గుర్తుతెలియని పురుషుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గ్రామ VRO పుప్పాల రుద్రమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.