హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం నేతృత్వంలో అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్

HYD: మూడు కార్పొరేషన్ల పరిధిలో క్యూర్-2026 చట్టం అమలుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఎం నేతృత్వంలో అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్‌ను, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల అమలుకు ఎగ్జిక్యుటివ్ కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యూర్ ప్రాంతం అభివృద్ధికి దశ, దిశ నిర్ణయించడంలో ఈ కమిటీ కీలక పాత్ర వహించనుంది.