హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్యం చేరువగా.. ఆర్థిక సమ్మిళిత పథకాలు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆర్థిక సమ్మిళిత పథకాల సంపూర్ణ అమలు ప్రచార 5వ విడత పోస్టర్‌ను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆవిష్కరించారు. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం సాగుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ ఈ పథకాల ప్రయోజనాలు అందేలా యంత్రాంగం నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు.