హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్లో ఈ పంట ధర తెలుసా..?

KMR: మద్నూర్ బిచ్కుంద మండలాల్లో రైతులు సోయాబీన్ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. ప్రైవేటు మార్కెట్లో క్వింటాలు సోయాబీన్‌కు రూ. 6,900 నుంచి రూ. 7,000 వరకు ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 5,700 మాత్రమే ఉండటంతో రైతులు ప్రైవేటు మార్కెట్లో విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు.