ప్రకాశం: ముండ్లమూరు మండలం తమ్మలూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి (చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగి) బుధవారం సాయంత్రం ఒంగోలు వద్ద రైలు పట్టాలపై మృతి చెందాడు. పెళ్లయి నెల రోజులే అయింది. భార్యను పురిమెట్లలోని పుట్టింట్లో దింపి ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. రైల్వే పోలీసులు తొలుత గుర్తుతెలియని యువకుడిగా నమోదు చేసి, రాత్రి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. కారణం తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్
రైలు పట్టాల కిందపడి నవవరుడు ఆత్మహత్య


