VZM: కొత్తవలస పోలీసు స్టేషను పరిధిలోని 202 కాలనీకి చెందిన గంట కోకిల ఈనెల 22న అదృశ్యమై తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు ఎస్సై జోగారావు గురువారం తెలిపారు.చదువుకొంటానంటే కుటుంబసభ్యులు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి చేసినట్లు చెప్పారు. తీవ్ర మనస్థాపనకు గురై ఇలా చేసినట్టు తెలిపారు.సదరు యువతిని కుటుంబసభ్యులకు స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అదృశ్యమైన యువతిని కుటుంబ సభ్యులకు అప్పగింత


