హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ‘ప్రశాంతి విద్వాన్‌ మహాసభ’ రెండో రోజు వేడుకలు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రశాంతి విద్వాన్‌ మహాసభను నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ తెలుగు, సంస్కృత పండితులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. దైవిక మాత శక్తులు, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల ప్రాధాన్యతను వివరించారు.