హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాటారం నూతన సీఐగా ఎంబడి భీమేష్

BHPL: కాటారం మండల కేంద్రంలో నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంబడి భీమేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కాటారం డీఎస్పీ సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మల్టీ జోన్‌-1 పరిధిలో జరిగిన సీఐల బదిలీల్లో కాటారం సీఐ నాగార్జున రావు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. శాంతి, భద్రత పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ భీమేష్ వెల్లడించారు.