హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి'

NDL: కలెక్టరేట్‌లో గురువారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ జి. రాజకుమారి సమీక్ష నిర్వహించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నామినేషన్లు, పోలింగ్ కేంద్రాలు, భద్రత, ఎన్నికల సామగ్రి నిర్వహణపై సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.