హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

W.G: యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పందేలు నిర్వహిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని, రెండు కోడిపుంజులు, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్టవిరుద్ధంగా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజకుమార్ హెచ్చరించారు.