BHPL: ఎలి నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చిట్యాల ఏవో శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తక్కువ నీటి వసతి ఉన్న రైతులు శనగ, కుసుమ,పెసర, మినుము, సజ్జ సాగు చేయాలన్నారు. మధ్యస్థ వసతి ఉన్నవారు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, నీటి వసతి, మార్కెట్ ఉన్నవారు కూరగాయలు సాగు చేయాలన్నారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: ఏవో


