హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వ్యాపారులకు రూ.50 లక్షల రుణాలు

WGL: వరంగల్ లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్‌లో తెలంగాణ పొదుపు, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం సభ్యులకు రూ.50 లక్షల రుణాలు మంజూరు చేశారు. దసరా పండుగ సందర్భంగా ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల మోసాల బారిన పడకుండా కూరగాయల వ్యాపారులకు అండగా నిలిచేందుకు ఈ రుణాలు అందించినట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ తెలిపారు.