హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు..!

KMR: నిజాంసాగర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యాసంవత్సరానికి గాను 9వ, 11వ తరగతుల లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ దరఖాస్తుల చివరి తేదీని అక్టోబర్ 22 వరకు పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపల్ రామ్ బాబు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఉచితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.