హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

WGL: నర్సంపేట పట్టణంలో కక్కెర్ల లవన్‌కుమార్ ఇంట్లో పేకాట ఆడుతున్న విశ్వసనీయ సమాచారంతో టాస్కఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.17,650 నగదు, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నిమిత్తం నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాజు తెలిపారు. పేకాటపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.