హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీపార్క్‌–మార్కెట్‌ రోడ్డుపై ప్రమాద భయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ నుంచి మార్కెట్‌ రోడ్డుకు వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు ప్రమాదకరంగా మారాయి. పెద్ద గుంతలతో రహదారి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి, రహదారిని సురక్షితంగా మార్చాలని కోరుతున్నారు.