హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీసాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

NZB: జక్రాన్ పల్లీ మండలం విదేశీ ఉద్యోగ వీసాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఉమ్మెడ అంజయ్య అలియాస్ అనిల్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఆరుగురి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2.80 లక్షల చొప్పున వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. గురువారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.